Site icon NTV Telugu

Governor Abdul Nazeer: ప్రజల మనసు గెలిచిన మహానేత వైఎస్‌ఆర్‌

Governor Abdul Nazeer

Governor Abdul Nazeer

Governor Abdul Nazeer: ప్రజల మనసు గెలిచిన మహానేత వైఎస్సార్‌ అంటూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ పేరుతో అందించిన అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను తెలుగు భాషను నేర్చుకుంటున్నాను అని తెలిపారు.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకుని వచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్న ఆయన.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సమాజ అభివృద్ధికి వైఎస్సార్ సేవలు మరిచిపోలేనివి అన్నారు.

Read Also: Kalyan Ram: డెవిల్ డిలే… ఆ పని ఇంకా అవ్వలేదు

ఇక, 78 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేసి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారన్నారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్.. వైఎస్సార్ ఆశయాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తోందని ప్రశంసించారు.. రాష్ట్ర సామాజిక, ఆర్ధిక రంగాల్లో కీలక అభివృద్ధి సాధించింది అది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి కితాబిచ్చిన ఆయన.. జాతీయ స్థాయిలో పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కీలక ప్రభావం చూపిస్తోందన్నారు.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..

Exit mobile version