NTV Telugu Site icon

YSR Law Nestham: వారికి శుభవార్త.. ఈ రోజే నిధులు విడుదల

Ysr Law Nestham

Ysr Law Nestham

YSR Law Nestham: కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తోంది. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ అందిస్తోంది. ఇందులో భాగంగా.. 2023-24 గాను రెండో విడత సాయాన్ని ఇవాళ విడుదల చేయబోతోంది. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు సీఎం జగన్‌. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా నిధులు విడుదల చేస్తారు.

Read Also: Masa Shivratri: మాస శివరాత్రి శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే అదృష్టం కలుగుతుంది

జులై నుంచి డిసెంబర్‌ వరకు ఆరు నెలలకు గాను ఒక్కొక్కరికి 30 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా 2 వేల 807 మంది జూనియర్‌ లాయర్లు లబ్దిపొందుతున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో సుమారు 8 కోట్ల రూపాయలను జమచేస్తోంది జగన్‌ సర్కార్‌. ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ. 49.51 కోట్లు. న్యాయ వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి, న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ. 25 కోట్ల ఆర్థిక సాయం ఏపీ ప్రభుత్వం అందించింది. కాగా, వరుసగా వివిధ పథకాలకు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ జమ చేస్తూ వస్తున్న విషయం విదితమే..

Show comments