NTV Telugu Site icon

Illegal Sand Mining: ఇసుక అక్రమ తవ్వకాలపై సర్కార్ సీరియస్.. చర్యలకు రంగం సిద్ధం..

Sand

Sand

Illegal Sand Mining: ఎన్టీఆర్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.. స్థానిక మైన్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.. నందిగామలోని కంచల, పెండ్యాలలో సీనరేజ్ వసూలు చేయవద్దని చెప్పినా తవ్వకాలు జరుపుతున్నట్టు గుర్తించింది టాస్క్ ఫోర్స్.. భారీ యంత్రాలతో మునేరులో తవ్వకాలు చేస్తున్నట్టు గుర్తించడంతో సర్కార్ సీరియస్‌గా ఉంది.. కంచల గ్రామంలో 15 లారీలు, కీసర గ్రామ పరిధిలో 45 లారీల ఇసుక నిల్వలు గుర్తిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది టాస్క్ ఫోర్స్.. స్థానిక టీడీపీ నేత వెంకట్ ఇసుక మాఫియలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారణ అయ్యిందంటున్నారు.. మునేరు కాల్వలో అక్రమ ఇసుక తవ్వకం, రవాణా జరుగుతున్నట్టు నిర్ధారణ అయ్యింది.. డ్రోన్స్ తో తవ్వకాలపై రికార్డు చేసిన వీడియోలు ప్రభుత్వానికి నివేదికతో పాటు అందజేసింది టాస్క్ ఫోర్స్.. కీసర స్టాక్ యార్డులో కూడా 50 లారీల ఇసుకను మాయం చేసినట్టు గుర్తించారు.. దీంతో.. అందరిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధం అవుతోంది టాస్క్ ఫోర్స్..

Read Also: Best Electric Cars 2024: 10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే.. ఫుల్‌ ఛార్జింగ్‌పై 365 కిలోమీటర్ల ప్రయాణం!

Show comments