Site icon NTV Telugu

Handloom Workers Thrift Fund: నేతన్నలకు శుభవార్త.. త్రిఫ్ట్ ఫండ్ తొలి విడతగా రూ.1.67 కోట్లు విడుదల

Handloom Workers Thrift Fund

Handloom Workers Thrift Fund

Handloom Workers Thrift Fund: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త అందించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి త్రిఫ్ట్ ఫండ్ నిధుల తొలి విడతను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 133 చేనేత సహకార సంఘాల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.1.67 కోట్లను జమ చేసింది. ఈ నిధుల ద్వారా 5,726 మంది నేతన్నలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది.

Nara Rohith: ‘పుష్ప’ మిస్.. ‘ఆదర్శ కుటుంబం’లో మరో అవకాశం, నారా రోహిత్ క్యారెక్టర్‌ ఇదే!

ఈ సందర్భంగా చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ.. చేనేత రంగ అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే త్రిఫ్ట్ ఫండ్ నిధుల విడుదల చేపట్టినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆప్కో బకాయిల చెల్లింపులపై కూడా మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. సంక్రాంతి పండుగకు ముందు రూ.5 కోట్ల ఆప్కో బకాయిలను చెల్లించామని, గత డిసెంబర్‌లో మరో రూ.2.42 కోట్ల బకాయిలను తీర్చామని తెలిపారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.9 కోట్లకు పైగా నిధులను నేతన్నలకు అందజేశామని తెలిపారు.

CM Chandrababu: 18 నెలల్లో ఏపీ బ్రాండ్ రీబిల్డ్.. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం..!

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. త్రిఫ్ట్ ఫండ్ నిధుల విడుదలతో పాటు ఆప్కో బకాయిలు చెల్లించినందుకు కూటమి ప్రభుత్వానికి, మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు. నేతన్నల జీవన భద్రత, ఆర్థిక స్థిరత్వం దిశగా ఇది కీలక ముందడుగు అని వారు అభిప్రాయపడ్డారు.

Exit mobile version