NTV Telugu Site icon

Cm Jagan : ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్

Jagan Ifthar

Jagan Ifthar

రంజాన్ మాసం సదర్భంగా ముస్లిం సోదరులకు ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడలోని విద్యాధరపురలోని మినీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మందికి పైగా ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. మీ అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. ఆ దేవుని చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని సీఎం జగన్ తెలిపారు. రాష్టాభివృద్ది కోసం అందరూ ప్రార్థించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.

Read Also : Redya Naik : రేవంత్‌ రెడ్డిపై రెడ్యానాయక్ హాట్‌ కామెంట్స్‌

ఈ వేడుకలో పాల్గొన్న డిప్యూటీ సీఎ: అంజాద్ భాషా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందని ఆయన వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన రాష్ట్రం ఏపీనేనని డిప్యూటీ సీఎం భాషా పేర్కొన్నారు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎ: ఇచ్చిన ఘనత జగన్ దేనని ప్రశంసించారు. గత ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోలేదని విమర్శించారు. మైనార్టీలకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇచ్చిన ఘనత.. ముస్లింలకు రిజర్వేషన్ల శాతం, ఫీజు రిజయంబర్స్ మెంట్ కూడా పెంచి ముస్లింలకు అండగా సీఎం జగన్ ఉన్నారని డిప్యూటీ సీఎం అంజద్ భాషా తెలిపారు. విద్యాధరపురం మినీ స్టేడియంలో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు నేతలు హాజరయ్యారు. ముస్లిం సోదరులకు అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలను సీఎం జగన్ తెలిపారు. అందరు బాగుండాలి మన రాష్ట్రం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని సీఎం జగన్ కోరారు.

Read Also : RCB vs CSK: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే

Show comments