Site icon NTV Telugu

Andhrapradesh: మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

Andhrapradesh

Andhrapradesh

Andhrapradesh: మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. కార్మిక సంఘాలతో సచివాలయంలోని సెకండ్‌ బ్లాక్‌లో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వర్చువల్‌గా సమావేశం కానున్నారు. పది మున్సిపల్ కార్మిక సంఘాలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి. సమాన పనికి సమాన వేతనంపై మున్సిపల్ వర్కర్స్ సంఘాలు పట్టుబడుతున్నాయి.

Read Also: Kesineni Nani: వైసీపీలోకి కేశినేని నాని!.. సీఎం జగన్‌తో కీలక భేటీ

గ్రాట్యుటీ ఇవ్వాలని మున్సిపల్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జీతాల పెంపు, గ్రాట్యుటీ కుదరదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. సమ్మె విరమించి సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. సమ్మె విరమించని అంగన్వాడీ వర్కర్ల విషయంలో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి చర్చలు అయినా కొలిక్కి వస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Exit mobile version