NTV Telugu Site icon

SC Sub-Classification: ఎస్సీ ఉప-వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh

Andhra Pradesh

SC Sub-Classification: సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ ఉప-వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏకసభ్య కమిషన్ ఈనెల 16 నుండి 19 వరకు వరుసగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలలో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా ఆయా పాత జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన సమావేశాల్లో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై మెమొరాండం స్వీకరించనున్నారు. కమిషన్‌కి నేరుగా సమర్పించలేని వారు, గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం, విజయవాడలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ వారి కార్యాలయంలో మెమొరాండం ఇవ్వవచ్చు. అక్‌నాలెడ్జ్‌మెంట్‌తో కూడిన పోస్టు లేదా ఈమెయిల్ omcscsubclassification@gmail.com ద్వారా గడువు 2025 జనవరి 9 వరకూ సమర్పించవచ్చు.

Read Also: Minister Gottipaati: నార్వే, బ్రిక్స్ దేశాల పారిశ్రామికవేత్తలతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ భేటీ

Show comments