Date Extended: ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల దరఖాస్తు గడువును పెంచుతూ ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులకు దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎమ్వీ సూర్యకళ వెల్లడించారు. దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు ప్రభుత్వం పొడిగించింది. దరఖాస్తు గడువు 13.12.2024 నుంచి 16.12.2024 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 97 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. http:apmsrb.ap.gov.in/msrb/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: YSRCP: సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ