NTV Telugu Site icon

Andhrapradesh: చంద్రబాబుకు భారీ షాక్‌.. గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసిన ప్రభుత్వం

Chandrababu

Chandrababu

Andhrapradesh: చంద్రబాబుకు భారీ షాక్‌ తగిలింది. ఉండవల్లి కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్‌ చేసింది. క్రిమినల్‌ లా అమెండ్మెంట్‌ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక జడ్జికి సమాచారమచ్చి లింగమనేని గెస్ట్‌హౌస్‌ను సర్కారు అటాచ్‌ చేసింది. చంద్రబాబు, నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడ్‌ప్రోకు పాల్పడ్డారని, వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి గెస్ట్‌హౌస్‌ను పొందారని సీఐడీ పేర్కొంటోంది. వ్యాపారి లింగమనేనికి లబ్ధి చేకూరేలా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడి బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్‌ పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో తేలింది. తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలున్నాయి.

Read Also: GVL Narasimharao: టీడీపీ, జనసేనలతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ క్లారిటీ!

వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్‌ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో క్రిమినల్‌ లా అమెండమెంట్‌ 1944 చట్టం ప్రకారం అటాచ్‌ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసింది. స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను అటాచ్ చేసింది.