NTV Telugu Site icon

AP Film Chamber of Commerce: ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు.. వ్యవస్థాపక అధ్యక్షుడిగా..

Ap Film Chamber Of Commerce

Ap Film Chamber Of Commerce

ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటైంది. వ్యవస్థాపక ఛైర్మన్‌గా టీజీ వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కర్నూలులో ఏర్పాటు చేశాం. సినీ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం.తమిళనాడు సినిమాలకు పుట్టినిల్లుగా ఉండేది.మద్రాస్ లో రాయలసీమ వాళ్లు పెద్ద,పెద్ద స్టూడియోలు నిర్మించి సినిమాలకు ప్రాణం పోశారు. కళలకు పుట్టినిల్లు రాయలసీమ. సినిమాలకు ఎక్కువగా ఫైనాన్స్ చేస్తున్నది మా రాయలసీమ వాసులు. కానీ సినిమా నిర్మాణం, చిత్రీకరణ ఇక్కడ జరగడం లేదు. ఎంతో ప్రాముఖ్యత ఉన్నా ఈ ప్రాంతంలో సినిమా నిర్మాణం జరగడం లేదు. రాష్ట్రం విడిపోయాక కూడా సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో ఉండిపోయింది. నిబద్ధతతో ఈ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, అనుమతులు కావాలన్నా మేము వారికి సహకరిస్తాం…” అని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు.

READ MORE: Conistable : ‘‘కానిస్టేబుల్’’గా వరుణ్ సందేశ్.. టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్