Chandrababu Naidu will take oath as CM in Amaravati: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) విజయం దాదాపుగా ఖాయమైంది. 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. టీడీపీ రెండు సీట్లను గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారట. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనిపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది.
ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 88. పొత్తుల్లో భాగంగా 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేయగా.. 21 స్థానాల్లో జనసేన, 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీడీపీ దోసుకుపోతోంది. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 20 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ కూడా దూసుకుపోతోంది. మరోవైపు వైసీపీ మాత్రం రేసులో లేకుండా పోయింది. కేవలం 14 సీట్లలో ఆధిక్యంలో ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉండాలంటే 18 సీట్లు గెలవాల్సి ఉంది.
