AP Elections 2024: ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 45 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 స్థానాల్లో జనసేన లీడ్‌లో ఉండగా.. 7 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు లోక్‌సభ స్థానాల్లో కూడా కూటమి లీడ్‌లో ఉంది.
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంగళగిరిలో నారా లోకేశ్, పూతలపట్టులో మురళీమోహన్ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి చంద్రబాబుకు 1594, బుచ్చయ్య చౌదరి 910 ఓట్ల ఆధిక్యం దక్కింది. కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
జగ్గంపేట అసెంబ్లీ స్థానంలో జ్యోతుల నెహ్రూ, రాజమహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి వాసు, తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్, చిత్తూరులో గురజాల జగన్‌మోహన్ ఆధిక్యంలో ఉన్నారు. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమా, బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు, ఒంగోలులో దామచర్ల జనార్దన్, గుడివాడలో వెనిగండ్ల రాము లీడ్‌లో కొనసాగుతున్నారు. రోజా, బుగ్గన, వేణు వెనకంజలో ఉన్నారు.