Gorantla Butchaih Chowdary wins against Chelluboyina Venugopala Krishna: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విజయం నమోదైంది. టీడీపీ మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 63,056 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 18 రౌండ్ల వరకు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 1,21,666 ఓట్లు రాగా.. మంత్రి చెల్లుబోయినకు 60,102 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముందునుంచి గోరంట్ల తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్లారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్, హిందూపూర్ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణలు సైతం విజయం వైపు పయనిస్తున్నారు. 160 స్థానాల్లో ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) అభ్యర్థులు గెలుపు దిశగా సాగుతున్నారు. మరోవైపు వైసీపీ పూర్తిగా వెనుకంజలో ఉంది. కనీసం 20 స్థానాల్లో కూడా ముందంజలో లేదు. ప్రతిపక్షంలో ఉండాలంటే.. 18 సీట్లు అసవరం అన్న విషయం తెలిసిందే.