NTV Telugu Site icon

AP Election Results 2024 Live Updates: ఏపీ ఎన్నికల ఫలితాలు 2024 లైవ్‌ అప్‌డేట్స్‌..

Ap Live Updates

Ap Live Updates

AP Election Results 2024 Live Updates: ఉత్కంఠ రేపుతోన్న ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో అన్ని పార్టీల నేతల్లో ఆసక్తి నెలకొనగా.. ఇప్పుడు ఎగ్జాట్‌ ఫలితాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల కమిషన్‌.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు అధికారులు.. మొదట పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించి.. ఆ తర్వాత ఈవీఎంలను తెరుస్తున్నారు.

The liveblog has ended.
  • 04 Jun 2024 07:54 PM (IST)

    తిరుపతిలో జనసేన ఘన విజయం

    తిరుపతిలో జనసేన ఘన విజయం. 62,500 ఓట్ల మెజార్టీతో ఆరణి శ్రీనివాసులు గెలుపు.

  • 04 Jun 2024 07:19 PM (IST)

    కుప్పంలో చంద్రబాబు ఘనవిజయం.

    కుప్పంలో చంద్రబాబు ఘనవిజయం. 48,184 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు గెలుపు.

  • 04 Jun 2024 07:02 PM (IST)

    ఇప్పటివరకు పూర్తయిన కౌంటింగ్‌ వివరాల ప్రకారం

    ఇప్పటివరకు పూర్తయిన కౌంటింగ్‌ వివరాల ప్రకారం. టీడీపీకి 46.64 శాతం. కోటి 49 లక్షల 96వేల 39 ఓట్లు. వైసీపీకి 39.42 శాతం ఓట్లు.. కోటి 20 లక్షల 50 వేల 334 ఓట్లు. జనసేనకి 8.49 శాతం ఓట్లు. 27లక్షల 92 వేల 653 ఓట్లు. బీజేపీ 2.80 శాతం ఓట్లు. 9లక్షల 19 వేల 671 ఓట్లు.

  • 04 Jun 2024 06:45 PM (IST)

    నారా లోకేష్‌ ఘన విజయం

    మంగళగిరిలో నారా లోకేష్‌ ఘన విజయం. 91,500 ఓట్ల మెజార్టీతో లోకేష్‌ గెలుపు.

  • 04 Jun 2024 06:41 PM (IST)

    కావలిలో టీడీపీ ఘన విజయం

    కావలిలో టీడీపీ ఘన విజయం. 29,700 ఓట్ల మెజార్టీతో కావ్య కృష్ణారెడ్డి గెలుపు.

  • 04 Jun 2024 06:21 PM (IST)

    అన్ని వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చాం. -వైఎస్‌ జగన్‌

    54 లక్షల మంది రైతున్నలకు పెట్టుబడి సాయం అందించాం. రైతన్నలకు తోడుగా రైతుభరోసా ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించాం. మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం. అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలని చూశాను. అందుకే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం. అన్ని వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చాం. -వైఎస్‌ జగన్‌

  • 04 Jun 2024 05:59 PM (IST)

    వంగలపూడి అనిత విజయం.

    పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత విజయం.

  • 04 Jun 2024 05:54 PM (IST)

    మూడో స్థానానికి పరిమితమైన వైఎస్‌ షర్మిల

    కడప ఎంపీ : మూడో స్థానానికి పరిమితమైన వైఎస్‌ షర్మిల. వైఎస్‌ షర్మిలకు లక్షా 36 వేల ఓట్లు. 66 వేల ఓట్ల ఆధిక్యంలో ఎంపీ అవినాష్‌రెడ్డి. కడప లోక్‌సభ స్థానంలో రెండోస్థానంలో టీడీపీ.

  • 04 Jun 2024 05:45 PM (IST)

    రేపు ఢిల్లీకి చంద్రబాబు

    రేపు ఢిల్లీకి చంద్రబాబు

  • 04 Jun 2024 05:43 PM (IST)

    ఆలూరులో వైసీపీ ఆధిక్యత

    ఆలూరులో వైసీపీ 2851 ఓట్ల ఆధిక్యత. రీకౌంటింగ్‌ జరపాలని టీడీపీ డిమాండ్‌.

  • 04 Jun 2024 05:39 PM (IST)

    చంద్రబాబు, పవన్‌ భేటీ.

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం. గన్నవరం చేరుకున్న పవన్‌ కల్యాణ్‌. కాసేపట్లో మంగళగిరిలో చంద్రబాబు, పవన్‌ భేటీ. మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు చేరుకున్న చంద్రబాబునాయుడు.

  • 04 Jun 2024 05:29 PM (IST)

    ఓటమి దిశగా భార్యభర్తలు

    ఓటమి దిశగా భార్యభర్తలు. చీపురుపల్లిలో మంత్రి బొత్స ఓటమి. విశాఖ ఎంపీగా వెనుకంజలో ఉన్న బొత్స ఝూన్సీ.

  • 04 Jun 2024 05:21 PM (IST)

    నూజివీడులో టీడీపీ ఘనవిజయం

    నూజివీడులో టీడీపీ ఘనవిజయం. 12,221 ఓట్ల మెజార్టీతో గెలిచిన పార్థసారథి.

  • 04 Jun 2024 05:19 PM (IST)

    వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

    అనంతరపురం : టీ.కొత్తపల్లిలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ. ఇరువర్గాల ఘర్షణలో ఆరుగురికి తీవ్రగాయాలు.

  • 04 Jun 2024 05:16 PM (IST)

    చంద్రబాబు, పవన్‌కు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి.

  • 04 Jun 2024 05:14 PM (IST)

    తంగిరాల సౌమ్య విజయం

    నందిగామ : టీడీపీ అభ్యర్థి ఘన విజయం. 27,007 ఓట్ల మెజార్టీతో గెలిచిన తంగిరాల సౌమ్య.

  • 04 Jun 2024 04:56 PM (IST)

    దేవగుడి ఆదినారాయణ గెలుపు

    జమ్మలమడుగు : బీజేపీ అభ్యర్థి ఘన విజయం. 17,181 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ గెలుపు.

  • 04 Jun 2024 04:54 PM (IST)

    చైతన్య రెడ్డి గెలుపు

    కమలాపురం : టీడీపీ అభ్యర్థి ఘన విజయం. 24,972 ఓట్ల మెజార్టీతో గెలిచిన చైతన్య రెడ్డి.

  • 04 Jun 2024 04:52 PM (IST)

    సుజనా చౌదరి విజయం

    విజయవాడ వెస్ట్‌ : బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయం. 46,540 ఓట్ల మెజార్టీతో సుజనా చౌదరి గెలుపు.

  • 04 Jun 2024 04:38 PM (IST)

    రాజశేఖర్‌ రెడ్డి విజయం

    శ్రీశైలం టీడీపీ అభ్యర్థి రాజశేఖర్‌ రెడ్డి విజయం. 6,041 ఓట్ల మెజార్టీతో రాజశేఖర్‌ రెడ్డి గెలుపు.

  • 04 Jun 2024 04:35 PM (IST)

    బాలనాగిరెడ్డి విజయం.

    మంత్రాలయం వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి విజయం. 12,843 మెజార్టీతో బాలనాగిరెడ్డి గెలుపు.

  • 04 Jun 2024 04:30 PM (IST)

    ఫరూఖ్‌ గెలుపు

    నంద్యాల : టీడీపీ అభ్యర్థి ఘనవిజయం. 12 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన ఫరూఖ్‌.

  • 04 Jun 2024 04:10 PM (IST)

    డీకే అరుణ ఘన విజయం..

    మహబూబ్ నగర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపు.. 4. 500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయం..

  • 04 Jun 2024 04:08 PM (IST)

    మల్కాజ్ గిరిలో బీజేపీ గెలుపు..

    మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం.. 2 లక్షల మెజార్టీతో ఈటల రాజేందర్ గెలుపు..

  • 04 Jun 2024 04:06 PM (IST)

    వరంగల్ లో కడియం కావ్య ఘన విజయం..

    వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం.. 2. 17 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన కడియం కావ్య..

  • 04 Jun 2024 04:04 PM (IST)

    తిరువనంతపురంలో నాలుగోసారి శశిథరూర్‌ విజయం

    కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ మరోసారి జయకేతనం ఎగురవేశారు. కేరళలోని తిరువనంతపురంలో తన సమీప బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై 15 వేల ఓట్ల తేడాతో గెలిచారు.. ఇక్కడి నుంచి శశిథరూర్‌ గెలవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం.

  • 04 Jun 2024 03:55 PM (IST)

    సీఎం జగన్‌ ఘన విజయం

    పులివెందులలో సీఎం జగన్‌ ఘన విజయం. 61,169 ఓట్ల మెజార్టీతో గెలిచిన జగన్‌.

  • 04 Jun 2024 03:54 PM (IST)

    మణిపూర్లో కాంగ్రెస్ ఆధిక్యం..

    మణిపూర్ రాష్ట్రంలోని రెండు లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. రెండు పార్లమెంట్ సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు..

  • 04 Jun 2024 03:52 PM (IST)

    వయనాడ్‌, రాయ్‌బరేలీలో రాహుల్‌ గాంధీ ఘన విజయం

    కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఘన విజయం సాధించారు. కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి గెలిచారు.. తన సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించాగా.. అటు ఉత్తరప్రదేశ్‌లోని తమ కంచుకోట రాయ్‌బరేలీలో 3.7 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో రాహుల్ గాంధీ జయకేతనం ఎగురవేశారు.

  • 04 Jun 2024 03:43 PM (IST)

    ప్రత్తిపాటి పుల్లారావు గెలుపు

    చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు 32వేల 98 ఓట్ల మెజార్టీతో గెలుపు.

  • 04 Jun 2024 03:40 PM (IST)

    యార్లగడ్డ వెంకట్రావు విజయం

    వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు విజయం. 36,524 ఓట్ల మెజార్టీతో గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు.

  • 04 Jun 2024 03:36 PM (IST)

    కొడాలి నాని తొలిసారి ఓటమి

    20 ఏళ్లలో కొడాలి నాని తొలిసారి ఓటమి. వరుసగా నాలుగు సార్లు గెలిచి ఐదోసారి కొడాలి నాని ఓటమి.

  • 04 Jun 2024 03:26 PM (IST)

    కుప్పంలో ఘర్షణ..

    కుప్పంలో ఘర్షణ.. కుప్పం మండలం చెక్కునత్తం గ్రామంలో టీడీపీ, వైసిపి శ్రేణుల మద్య ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న గ్రామస్తులు... పలువురికి గాయాలు... వైసీపీ గుర్తు అయిన సీలింగ్ ఫ్యాన్‌ను తాడుతో కట్టుకొని రోడ్డుపై లాకెళ్లిన వ్యవహారంతో చెలరేగిన ఘర్షణ.

  • 04 Jun 2024 03:17 PM (IST)

    నిమ్మకాయల చిన రాజప్ప విజయం

    పెద్దాపురంలో హ్యాట్రిక్ విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చిన రాజప్ప.

  • 04 Jun 2024 03:15 PM (IST)

    బాలకృష్ణ హ్యాట్రిక్‌ విజయం

    హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్‌ విజయం. 31,602 ఓట్ల మెజార్టీతో బాలకృష్ణ గెలుపు.

  • 04 Jun 2024 03:01 PM (IST)

    వైసీపీ నేతల వారసుల ఓటమి..

    ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నేతల వారసులు ఓటమిపాలయ్యారు.. తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి, బందర్‌లో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి పరాజయం పాలయ్యారు.

  • 04 Jun 2024 02:54 PM (IST)

    పవన్‌ కల్యాణ్‌ గ్రాండ్‌ విక్టరీ..

    పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విజయం.. 69,169 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై విజయం సాధించిన జనసేనాని

  • 04 Jun 2024 02:00 PM (IST)

    ఓటమి దిశగా 20 మంది మంత్రులు..

    ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఓటమి దిశగా 20 మంది మంత్రుల ప్రయాణం సాగుతోంది.. మంత్రులు ధర్మాన, సిదిరి అప్పలరాజు, రాజన్నదొర, బొత్స, అమర్నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి, తానేటి వనిత, జోగి రమేష్, అంబటి రాంబాబు, విడదల రజినీ, ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, రోజా, అంజాద్‌ బాషా, బుగ్గన, ఉషశ్రీ చరణ్‌ వెనుకబడ్డారు.

  • 04 Jun 2024 01:36 PM (IST)

    చంద్రబాబుకు మోడీ ఫోన్‌..

    టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌ చేశారు.. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం పట్ల అభినందనలు తెలిపిన మోడీ..

  • 04 Jun 2024 12:33 PM (IST)

    9న చంద్రబాబు ప్రమాణస్వీకారం

    టీడీపీ కూటమి భారీ విజయాన్ని అందుకోబోతోంది.. దీంతో.. ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబ నాయుడు.. ఈ నెల 9వ తేదీన అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. 4వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత.

  • 04 Jun 2024 11:50 AM (IST)

    బుచ్చయ్య చౌదరి విజయం..

    రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి విజయం సాధించారు.. తన ప్రత్యర్థిపై 50 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు బుచ్చయ్యచౌదరి

  • 04 Jun 2024 11:26 AM (IST)

    ఏపీలో టీడీపీ సునామీ..

    సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సునామీ సృష్టింస్తోంది.. టీడీపీ-జనసేన-బీజవేపీ కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయినంత పని అయ్యింది.. నిరాశలో మునిగిపోయాయి వైసీపీ శ్రేణులు.. తెలుగుదేశం పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయం నమోదు చేయబోతున్నారు చంద్రబాబు.. 1994 విజయాన్ని సైతం అధిగమించే దిశగా టీడీపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. దాదాపు 93 శాతం స్ట్రైక్‌ రేట్‌తో టీడీపీ విజయం సాధించబోతోంది.. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతోంది. భారీ ఆధిక్యం దిశగా కూటమి అభ్యర్థులు వెళ్తున్నారు.. ఇప్పటికే 131 సీట్ల ఆధిక్యంలో టీడీపీ, 19 చోట్ల జనసేన, 7 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది.

  • 04 Jun 2024 11:00 AM (IST)

    భారీ ఆధిక్యం దిశగా పవన్‌..

    పిఠాపురంలో భారీ ఆధిక్యం దిశగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ దూసుకెళ్తున్నారు.. ఆరు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యే సరికి 25,244 ఓట్ల ఆధిక్యంలో పవన్ ఉన్నారు. ఇంకా 12 రౌండ్ల కౌంటింగ్‌ మిగిలి ఉంది.

  • 04 Jun 2024 10:48 AM (IST)

    155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి

    ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు... రాయలసీమలోనూ కూటమి అభ్యర్థుల అనూహ్య విజయాలవైపు ముందుకు వెళ్తుండగా.. దక్షిణ కోస్తాలో కూటమి అభ్యర్థుల విజయ ఢంకా మోగిస్తున్నారు.. ఇక, ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల పూర్తి ఆధిక్యత కనబరుస్తున్నారు. 20 లోక్‌సభ స్థానాల్లో కూటమిదే పైచేయిగా కనిపిస్తోంది.

  • 04 Jun 2024 10:36 AM (IST)

    టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా పార్టీ శ్రేణులు

    టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు భారీగా చేరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. కార్యాలయం గేటు ముందు టపాసులు కాల్చి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నివాసం వద్ద కూడా టపాసులు పేల్చారు తెలుగుదేశం శ్రేణులు. రెండు చోట్లా అంబరాన్ని అంటుతున్నాయి టీడీపీ శ్రేణుల సంబరాలు.

  • 04 Jun 2024 10:18 AM (IST)

    కౌంటింగ్‌ సెంటర్‌ నుంచి వెళ్లిపోయిన వల్లభనేని వంశీ, కొడాలి నాని

    ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు.. ఇక, ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ కౌంటింగ్‌ సెంటర్ల నుంచి వెళ్లిపోయారు.

  • 04 Jun 2024 09:38 AM (IST)

    మంత్రుల వెనుకంజ..

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు.. నగరి అసెంబ్లీ స్థానంలో మంత్రి ఆర్కే రోజా.. డోన్‌ అసెంబ్లీ స్థానంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాజమండ్రి రూరల్‌లో మంత్రి చెల్లుబోయిన వేణు, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనుకంజలో ఉన్నారు.

  • 04 Jun 2024 09:11 AM (IST)

    లీడ్‌లో బాలయ్య..

    హిందూపురం అసెంబ్లీ స్థానంలో నందమూరి బాలకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు.. మొదటి రౌండ్‌లో 1,880 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు బాలకృష్ణ..

  • 04 Jun 2024 08:52 AM (IST)

    ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ కూటమి..

    543 లోక్‌సభ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272 కాగా, లీడింగ్‌లో మ్యాజిక్ ఫిగర్‌ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే దాటింది.

  • 04 Jun 2024 08:50 AM (IST)

    రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ లీడింగ్.

    వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీలో ఉన్న రాహుల్ గాంధీ, రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Show comments