Site icon NTV Telugu

AP EAPCET 2025 Results: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌‌‌ 2025 ఫలితాలు విడుదల..!

Ap Eapcet 2025

Ap Eapcet 2025

AP EAPCET 2025 Results: ఏపీ ఈఏపీసెట్‌ 2025 ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫలితాలు ఫలితాలు ఈ రోజు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షను జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU), కాకినాడ విజయవంతంగా నిర్వహించింది. మే 19 నుండి మే 27 వరకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 3,40,300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక నేడు ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఈఏపీసెట్‌ 2025 లో మొత్తం 75.67 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఇక ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాల్లో టాపర్స్ లిస్ట్ ఇలా ఉంది.

Read Also: BC Janardhan Reddy: ఓటు అనే ఆయుధంతో ప్రజలే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు.. మంత్రి కీలక వ్యాఖ్యలు..!

పరీక్ష ముగిసిన 12 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించారు. ఈ పరీక్షకు మొత్తం 3,40,300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 2,57,509 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈఏపీసెట్ మొత్తానికి ఉత్తీర్ణత శాతం 75.67% గా నమోదు అయింది. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 71.65% ఉత్తీర్ణత శాతం సాధించారు. ఇందులో 2,64,840 విద్యార్థులు హాజరు కాగా.. 1,89,748 మంది అర్హత సాధించారు. మరోవైపు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 89.80% అర్హత సాధించారు. ఇందులో 75,460 విద్యార్థులు హాజరు కాగా.. 67,761 మంది అర్హత సాధించారు.

* ఇంజినీరింగ్ విభాగంలో టాప్ ర్యాంకర్లు:
అనిరుధు రెడ్డి – తొలి ర్యాంక్

భాను రెడ్డి – రెండో ర్యాంక్

యస్వంత్ సాధ్విక్ – మూడో ర్యాంక్

రామ చరణ్ రెడ్డి – నాలుగో ర్యాంక్

భూపతి నిఖిల్ అగ్ని హోత్రి – ఐదో ర్యాంక్

Read Also: Crime News: సూట్‌కేసులో 9 ఏళ్ల బాలిక.. అత్యాచారం చేసి, హత్య..

* అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాల్లో టాప్ ర్యాంకర్లు:
హర్ష వర్ధన్ – తొలి ర్యాంక్

(రెండో ర్యాంక్ గణనలో పొందుపరచలేదు)

మల్లేష్ కుమార్ – మూడో ర్యాంక్

షణ్ముక్ – నాలుగో ర్యాంక్

సత్య వెంకట్ – ఐదో ర్యాంక్

గోవర్ధన్ – ఆరో ర్యాంక్

లక్ష్మి చరణ్ – ఏడో ర్యాంక్

కిరీటి – ఎనిమిదో ర్యాంక్

మోహిత్ శ్రీ రాం – తొమ్మిదో ర్యాంక్

సూర్య చరణ్ – పదవ ర్యాంక్.

Exit mobile version