NTV Telugu Site icon

Weather Update: ఏపీలో గురువారం వడగాల్పులు….బయటకు వెళితే అంతే సంగతులు

Heatwaves

Heatwaves

ఏపీలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. కొన్ని మండలాల్లో అయితే తీవ్ర వడగాల్పులతో జనం వడదెబ్బ బారిన పడుతున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. ఐఎండి అంచనాల ప్రకారం గురువారం 125 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసేజ్ లు పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు విపత్తుల సంస్థ మెసెజ్ అందినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు.

గురువారం మన్యం జిల్లా కొమరాడ, పార్వతీపురం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్రవడగాల్పు వీచే అవకాశం ఉంది.

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(125) :-
అల్లూరి జిల్లా 7,
అనకాపల్లి 15,
తూర్పుగోదావరి 4,
ఏలూరు 2,
గుంటూరు 11,
కాకినాడ 10,
కృష్ణా 4,
ఎన్టీఆర్ 12,
పల్నాడు 5,
పార్వతీపురంమన్యం 11,
శ్రీకాకుళం 13,
విశాఖపట్నం 2,
విజయనగరం 23 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

వైఎస్ఆర్ జిల్లాలో 6 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం అనకాపల్లి 8, విజయనగరం ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయి. మరో 93 మండలాల్లో వడగాల్పులు నమోదైయినట్టు అధికారులు వెల్లడించారు. తీవ్రమయిన ఎండ ఉండే సమయానికి ముందే ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరాలని, ఎండగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళి అపాయం బారిన పడవద్దని అధికారులు సూచించారు.

Read Also:Viral News : కూలీగా మారిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌