NTV Telugu Site icon

Weather Update: ఎండ తీవ్రత … రేపు ఆ మండలాల్లో వడగాల్పులు

Heat Waves1

Heat Waves1

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమిలా మారింది వేసవి కాలం. ఏపీలో పలు ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఎండి అంచనాల ప్రకారం గురువారం 125 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు విపత్తుల సంస్థ మెసెజ్ అందినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

శుక్రవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(48) :-
అల్లూరి జిల్లా 1,
అనకాపల్లి 14,
గుంటూరు 7,
కాకినాడ 7,
కృష్ణా 4,
ఎన్టీఆర్ 4,
పల్నాడు 1,
విశాఖపట్నం 1,
విజయనగరం జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని డా.బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. గురువారం అనకాపల్లి 8, విజయనగరం ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయి. మరో 51 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి.

Read Also:26/11 Mumbai Terror Attacks: ముంబై దాడుల నిందితుడిని భారత్‌కు అప్పగించనున్న అమెరికా .. 30 రోజుల్లో కోర్టు నిర్ణయం