NTV Telugu Site icon

Pawan Kalyan: వెన్నెల సంఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan

Pawan Kalyan

పదోతరగతి విద్యార్థి వెన్నెల తల్లిదండ్రులు మధురపూడి విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. తమ కుమార్తె విషయంను పవన్ దృష్టికి వెన్నెల కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వెన్నెల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ నేడు పవన్‌ కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. మధ్యాహ్నం వచ్చి మాట్లాడతానని డిప్యూటీ సీఎం పవన్‌ వారికి భరోసా ఇచ్చారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడు లంకకు చెందిన వెన్నెల.. సెలవు రోజుల్లో పాఠశాల నిర్వహిస్తున్నారని డీఈఓకి ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన స్కూల్ కరెస్పాండెంట్ వెన్నెలను మందలించాడు. పదో తరగతి నువ్వు ఎలా పాస్ అవుతావో చూస్తానని బెదిరించాడు. దాంతో వెన్నెల ఆత్మహత్య చేసుకుంది. ఫిర్యాదు చేసిన పాపానికి పదో తరగతి నువ్వు ఏ రకంగా పాస్ అవుతావో చూస్తానని కరెస్పాండెంట్ బెదిరించిన కారణంగా వెన్నెల ఆత్మహత్య చేసుకుందని పవన్ కళ్యాణ్ దృష్టికి ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.

Also Read: Diwali Celebrations: టపాసులు పేలుస్తూ ఆవులను పరుగెత్తించారు.. ఇదో ఆచారమట మరి!

తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం రెండు గంటలకు కుటుంబ సభ్యులతో మాట్లాడతానని ఓస్డీ ద్వారా వెన్నెల కుటుంబ సభ్యులకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమాచారం ఇచ్చారు. పవన్ ద్వారా తమకు న్యాయం జరుగుతుందని వెన్నెల కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ షిరిడి సాయి విద్యానికేతన్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న వారు డిమాండ్ చేస్తున్నారు. నేడు ఏలూరులో పవన్ పర్యటించనున్న విషయం తెలిసిందే.

Show comments