NTV Telugu Site icon

Pawan Kalyan Warning: అభిమానులకు పవన్‌ కల్యాణ్‌ స్వీట్‌ వార్నింగ్‌.. నన్ను పనిచేసుకోనివ్వండి..!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan Warning: పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. తన అభిమానులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. గిరిజన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన పవన్‌.. ప్రధాన మార్గం నుంచి బాగుజోల గ్రామానికి నడిచి వెళ్లారు.. గిరిజనుల కష్టాలను స్వయంగా చూసి తెలుసుకున్నారు.. గిరిజనులకు డోలీ మోతలు తప్పేలా కొత్త రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.. అయితే, ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతుండగా.. ఓజీ.. ఓజీ.. అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు.. వెంటనే వారికి స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చిన ఆయన.. ఓజీ.. ఓజీ.. అని అరవకండి.. నన్ను పని చేసుకోనివ్వండి అని సూచించారు.. నేను డిప్యూటీ సీఎంను అయినా.. ఇంకా సీఎం సీఎం అని అరుస్తున్నారు.. ఇది సరైంది కాదని హితవు చెప్పారు.. ఇక, తిరుబాటును, భాషను నేర్పించిన నేల ఇది.. మీరు సినిమాల మోజులో పడి… హీరోలకు జేజేలు కొట్టడం కాదు.. మీ జీవితాల మీద దృష్టి పెట్టండి అని సూచించారు..

Read Also: KTR Case: హైకోర్టులో కేటీఆర్‌ కేసు విచారణ.. ఏసీబీ కేసుపై లంచ్‌మోషన్‌ పిటిషన్

ఇక, మాట్లాడితే అన్నా మీసం తిప్పు.. మీసం తిప్పు అంటారు.. నేను మీసం తెప్పితే రోడ్ల పడవు… చాతీ మీద కొట్టుకుంటే రోడ్లు పడవు.. నేను ప్రధాని, ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి చెబితే రోడ్లు పడతాయి.. అందుకే నన్ను పని చేయనివ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. 2019లో నన్ను గెలిపించలేదు… పరీక్షించారు నిలబడతాడో లేదో అని.. అది మంచిదే అన్నారు.. రోడ్ల నిర్మాణంలో క్వాలిటీ ఉందో మీరు చెక్ చేస్తూ ఉండాలి.. గొడవ పెట్టుకోండి అని సూచించారు.. డోలిలో గర్బీణీలు చనిపోతే నా చెల్లి, అక్క చనిపోయినంత బాధపడే వాడిని అంటూ గుర్తుచేసుకున్నారు పవన్‌ కల్యాణ్‌..