NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: అమిత్‌ షాతో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నా..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హస్తిన పర్యటనలో ఉన్నారు. తొలిసారి ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్‌ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. ఏపీలో పరిస్థితులు, రాజకీయ అంశాలపై అమిత్‌ షాతో పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్‌ పర్యటనపై ఉత్కంఠ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని పవన్ వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మరింత బాధ్యతగా ఉంటామన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా బాధ్యతతోనే పర్యటనలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు.

Read Also: Vizianagaram: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్‌

 

Show comments