Site icon NTV Telugu

Narayana Swamy: వైసీపీని వీడుతున్న వారందరూ చంద్రబాబు కోవర్టులే.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Narayana Swamy

Narayana Swamy

Narayana Swamy: ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడుతున్న వారందరూ చంద్రబాబు కోవర్టులే.. ముందు నుంచి చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని ఆయన ఆరోపించారు. వైసీపీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్‌లో కూడా చంద్రబాబు కోవర్టులు ఉన్నారన్నారు. వైసీపీలో కూడా కొంతమంది చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని.. వాళ్ళు ఏం చేస్తారో అనే భయం ఉందన్నారు. అందుకే నమ్మకస్తులకే జగన్ పట్టం కడుతున్నారన్నారు. జగన్ ఎవరినీ నమ్మకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలని తాను అభ్యర్థిస్తున్నానన్నారు.

Read Also: TDP-Janasena: చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ భేటీ.. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చ

టీడీపీలో ఉన్న కొంతమంది ఎస్సీలు వైసీపీలో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారని.. చంద్రబాబు వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడని.. నిరూపించటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారిని తీసుకోవద్దని జగన్ కాళ్ళపై పడి అడిగానని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పారు. వాళ్ళంతా మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోలేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును కలవటం షర్మిల విచక్షణకు వదిలేస్తున్నానని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డి మరణానికి సోనియాగాంధీ, చంద్రబాబు కారణం అన్న నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. నేనే కాదు ప్రజలందరూ అదే విధంగా అనుకుంటున్నారని.. అందరిపై కేసులు పెడతారా అంటూ ఆయన ప్రశ్నించారు.

Exit mobile version