Site icon NTV Telugu

Tanuku Police Crime: దొంగలతో చేతులు కలిపిన ఖాకీలు.. స్టేషన్‌లోనే సెటిల్‌మెంట్‌!

Tanuku Rural Police

Tanuku Rural Police

దేశంలో కరడుగట్టిన కేడీ గాళ్లను కటకటాల పాలు చేసిన పోలీసులు ఉన్నారు.. బడా చోర్‌ల ఆటకట్టించిన ఖాకీలు కూడా ఉన్నారు. అంతేకాదు దొంగలతో కలిసి వాటాలు పంచుకున్న ఖాకీలు కూడా ఉన్నారండోయ్.. అది కూడా పోలీస్ స్టేషన్‌లోనే సెటిల్‌మెంట్‌ చేసుకున్నారు. ఈ ఘటన ఎక్కడో కాదు.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. కేసు మాఫీ కోసం ఏకంగా స్టేషన్‌లో పోలీసులు వాటాలు పంచుకున్నారు.

వివరాల ప్రకారం… తణుకు మండలం వేల్పూర్‌లో ఆకుల మారుతి రావుకు గేదెల ఫామ్ ఉంది. ఇటీవల ఫామ్‌లో రెండు గేదెలను ఇద్దరు వ్యక్తులు దొంగలించారు. ఈ విషయం గురించి తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో మారుతి రావు ఫిర్యాదు చేశారు. గేదెలను దొంగిలించిన ఇద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. కేసు మాఫీకి 12 లక్షల రూపాయలకు దొంగలతో పోలీసులు డీల్ కుదుర్చుకున్నారు. గేదెలు పోగొట్టుకున్న బాధితుడు మారుతి రావుకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి.. మిగతా సొమ్మును పోలీసులు జేబుల్లో వేసుకున్నారు.

దొంగల నుంచి పోలీసులు డబ్బు తీసుకుంటున్న సమయంలో ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌ ఏఎస్ఐ అంజి బాబుతో పాటు మరో కానిస్టేబుల్ సంగీత్ డబ్బు తీసుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మరి వీరిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి.

Exit mobile version