Site icon NTV Telugu

Crime News: డబ్బులు ఇవ్వలేదని.. భార్యను అతికిరాతకంగా నరికి చంపిన భర్త!

Dead

Dead

అడిగిన డబ్బులు ఇవ్వలేదని.. మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యను నరికి చంపేశాడు. అతికిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కంసాలిపేటలో చోటుచేసుకుంది. కొత్తపేట పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

షేక్‌ నగీనా తన భర్త బాజీతో కలిసి కంసాలిపేటలో నివాసం ఉంటోంది. షేక్ నాగిన (32) సమోసాల దుకాణంలో పనిచేస్తుంది. ఆమె భర్త షేక్ బాజీ (35) పెయింటర్‌. అతడు ఏ పని చేయకుండా నిత్యం తాగుతుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పిల్లల కోసం నాగిన కష్టపడుతోంది. కొంత డబ్బులను చుట్టుపక్కల వారికి ఆమె వడ్డీలకు ఇచ్చింది. ఆ వడ్డీ డబ్బులతో పిల్లలను చదివిస్తోంది. మద్యానికి బానిసై బాజీ.. ఈ రోజు ఉదయం 11 గంటలకు భార్యను డబ్బులు అడిగాడు. ఆమె లేవని చెప్పడంతో కాసేపు ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది.

Also Read: Pawan Kalyan: హడావుడిగా గుర్ల టూర్ ముగించుకున్న డిప్యూటీ సీఎం పవన్‌!

మద్యం మత్తులో ఉన్న బాజీ అడిగిన డబ్బు ఇవ్వలేదని కత్తితో భార్య నగీనా గొంతు కోసి చంపేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రక్తపు మడుగులో పడి ఉన్న నగీనా శవాన్ని గవర్నమెంట్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. బాజీని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు.

Exit mobile version