CM YS Jagan: రేపు(గురువారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 6.15 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు. రాత్రి ఏడున్నరకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. రాత్రి 8 గంటలకు గండికోటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. సోదరి షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొననున్నారు. వేడుక అనంతరం రాత్రి 10.10 నిమిషాలకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
Read Also: YS Sharmila Meets Pawan: పవన్ కళ్యాణ్‌ను కలిసిన వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ షర్మిల తన కుమారుడు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 20వ తేదీ తరువాత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధంకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిశ్చితార్ధంతో పాటుగా పెళ్లికి రావాలని పార్టీలకు అతీతంగా షర్మిల అందరినీ ఆహ్వానించారు. ఫిబ్రవరి 17న రాజారెడ్డి – అట్లూరి ప్రియ వివాహం జరగనుంది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఈ నె 18న హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం నిశ్చితార్ధంతో పాటుగా వివాహం, ఆ తరువాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రిపిప్షెన్ ఆహ్వానాలను ఇప్పటికే షర్మిల పలువురు ప్రముఖులకు అందించారు. రేపు రాజారెడ్డి – ప్రియ ఎంగేజ్ మెంట్ హైదరాబాద్‌లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో జరగనుంది. ఇటీవల తన అన్న సీఎం జగన్‌ను కలిసి రావాలని వైఎస్ షర్మిల కోరారు. ఇందుకు జగన్ అంగీకరించినట్లు స్వయంగా షర్మిల వెల్లడించారు. ఇప్పుడు ఎంగేజ్ మెంట్, వివాహం అనంతరం నిర్వహించే రిసిప్షెన్ ఆహ్వాన పత్రికలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రానున్నారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటుగా రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.