Site icon NTV Telugu

CM Jagan Tour: నేడు సీఎం జగన్‌ విజయవాడ పర్యటన

Jaganmohan Reddy

Jaganmohan Reddy

AP CM Jagan Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఏ కన్వెన్షన్‌ సెంటర్‌‌లో ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలలో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

Also Read: Off The Record: తిరుపతి సైకిల్ రివెర్స్‌లో నడుస్తుందా..? సెల్ఫ్ గోల్ వేసుకున్నారా..?

నేడు జిల్లాలోని కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. వచ్చే సోమ, మంగళవారాల్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. బాధితులకు అన్ని రకాల సహాయ చర్యలు తీసుకుని ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. ఆదివారం సాయంత్రానికి సీఎం ఓ కార్యాలయం ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని అధికారికంగా విడుదల చేస్తుంది.

Exit mobile version