NTV Telugu Site icon

AP CM Jagan: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై సీఎం జగన్‌ సమీక్ష

Jagan

Jagan

AP CM Jagan: రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మార్చి నెలలో ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. విశాఖ కేంద్రంగా రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్‌లో పెట్టుబడిదారులతో 13 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. చేసుకున్న ఒప్పందాలు ఎంత మేరకు కార్యరూపం దాల్చాయనే అంశంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష చేపట్టారు.

Read Also: Minister Amarnath: రెండు రైళ్లలో ఏపీకి చెందిన 342 మందిని గుర్తించాం..

ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్, టూరిజం సీఈవో కన్నబాబు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.