NTV Telugu Site icon

CM YS Jagan: ఏపీలో ఎన్నికల తేదీలపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

Jagan

Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ముందుగానే ఎన్నికలు జరగనున్నట్లుల తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల తేదీలపై సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశం సందర్భంగా ఎన్నికలపై సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని మంత్రులతో సీఎం అన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కరెంట్ కోతలు ఉండే అవకాశం ఉంటుందని.. అందుకే ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

Read Also: AP Cabinet Decisions: పెన్షన్‌ పెంపు, విశాఖ మెట్రోతో పాటు ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

“ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాం. అయినా కూడా మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలి. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చు. తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలి. ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.” అని సీఎం జగన్‌ కేబినెట్‌ భేటీలో అన్నారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష పార్టీల విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.