NTV Telugu Site icon

CM YS Jagan: జనంలోకి సీఎం జగన్‌.. సొంతనియోజకవర్గంలో ముగిసిన బస్సు యాత్ర

Cm Jagan

Cm Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో జనంలోకి సీఎం జగన్‌ వెళ్తున్నారు. ఇడుపులపాయ వద్ద ఎన్నికల ప్రచారాన్ని సీఎం ప్రారంభించగా.. ఇప్పటివరకు ఆయన యాత్ర తన సొంత నియోజకవర్గమైన పులివెందులను దాటి కమలాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గంలో బస్సు యాత్ర కొనసాగుతోంది. బస్సు యాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా జననీరాజనం లభిస్తోంది. హారతులు ఇస్తూ మహిళలు స్వాగతం పలుకుతున్నారు. బస్సులో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో పాటు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, కడప జిల్లా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కాసేపట్లో ప్రొద్దుటూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.

Read Also: CM Jagan Election Compaign: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు కడప జిల్లాలో బస్సుయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో నిర్వహించే బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు సీఎం చేరుకుంటారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రికి ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు.