NTV Telugu Site icon

Jagananna Thodu: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం.. వడ్డీ లేకుండా రుణం.. నేడే వారి ఖాతాల్లో నగదు జమ

Jagananna Thodu

Jagananna Thodu

Jagananna Thodu: ఏదైనా అవసరం కోసం ఎవరిని డబ్బులు అడగాలి.. ఎవరిని అడిగితే ఏమనుకుంటారో అనే ఆలోచన కొందరిని వెనక్కి నెడుతుంది.. ఇక, చిరు వ్యాపారస్తుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.. ఎక్కువ వడ్డీతో తక్కువ కాలంలో చెల్లించాలనే షరతులతో కొందరు డబ్బులు ఇస్తుండడం.. అలా డబ్బులు తీసుకుని చిరు వ్యాపారులు ఇబ్బందులు పడిన ఘటనలు ఎన్నో ఉంటాయి.. అయితే, ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు.. ఆ అధిక వడ్డీల బారిన పడకుండా ఉండేందుకు జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తోంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. వరుసగా 8వ విడత జగనన్న తోడు పథకం అమలుకు ఈ రోజు శ్రీకారం చుట్టనున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు.

Read Also: Kadiyam Srihari: కడియం ఆసక్తికర వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ను తిరిగి టిఆర్ఎస్ గా మార్చండి..!

ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో బటన్‌ నొక్కి చిరు వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం చొప్పున మొత్తం 3,95,000 మంది చిరు వ్యాపారులకు లబ్ది చేకూర్చనున్నారు. లబ్దిదారులకు రూ.417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు మంజూరు చేయనున్నారు. మరో 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కల్పించనున్నారు.. మొత్తంగా ఈరోజు రూ. 431.58 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో వర్చువల్ గా జమ చేయనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, సీఎం వైఎస్‌ జగన్‌.. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు.. నిలదొక్కు­కొనేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక చేయూత అందిస్తోన్న విషయం విదితమే.. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. రుణాలను సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం ఇస్తున్న విషయం విదితమే.