NTV Telugu Site icon

CM YS Jagan: రేపు కోనసీమ జిల్లాకు సీఎం జగన్‌.. విషయం ఇదే..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఓవైపు రివ్యూలు.. మరోవైపు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు ప్రైవేట్‌ పంక్షన్లకు హాజరవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, రేపు సీఎం వైఎస్‌ జగన్‌.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు.. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. దీని కోసం రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read Also: Pawankalyan ‘BRO’ : వామ్మో.. ఐటెం సాంగ్ కు ఊర్వశి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

కాగా, తన కుమారుడి పెళ్లి పత్రికపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతి ఫొటోలను ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ముద్రించిన విషయం విదితమే.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.. అంతేకాదు.. తన కుమారుడి వివాహ శుభలేఖపై సీఎం వైఎస్‌ జగన్ దంపతుల ఫొటో ముద్రించడంపై ఆయన వివరణ కూడా ఇచ్చారు. సామాన్యుడినైన తాను మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని, అందుకే తన కుమారుడి వివాహ శుభలేఖపై సీఎం జగన్ దంపతుల ఫొటో ముద్రించానని చెప్పుకొచ్చారు. అయితే, గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాదరావు.. మొదట్లో జనసేనతో ఉన్నా.. క్రమంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యారు.. అసెంబ్లీ వేదికగా పలు సందర్భాల్లో సీఎం వైఎస్‌ జగన్‌పై ఆయన ప్రశంసలు కురిపించిన విషయం విదితమే.