Site icon NTV Telugu

CM YS Jagan: మరోసారి ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌.. ఈసారి ఎందుకంటే..?

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఇప్పటికే పలు సందర్భాల్లో ఢిల్లీ వెళ్లిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులను కలుస్తూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తూ.. పెండింగ్‌ నిధుల విడుదల తదితర అంశాలపై చర్చిస్తూ వచ్చారు. ఇక, ఈనెల 27న మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు ఏపీ సీఎం.. న్యూఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరుకానున్నారు.. మరోవైపు.. గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్న అంశాలపై అధికారులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం జగన్‌..

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

కాగా, 27వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో వికాస్‌ భారత్‌ @ 2047, ఎంఎస్‌ఎంఈలు, మౌలిక సదుపాయాలు–పెట్టబడులు, వ్యాపార వర్గాలకు సులభతరమైన విధానాలు, మహిళా సాధికారత, ఆరోగ్యం మరియు పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి, గతి శక్తి ఏరియా డెవలప్‌మెంట్, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పై చర్చించనుంది నీతిఆయోగ్‌ పాలక మండలి. ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులను నీతి ఆయోగ్‌ వేదికపై వివరించనున్నారు సీఎం జగన్‌.. ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు–నేడు, తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం.. తదితర అంశాలను నీతి ఆయోగ్‌ సమావేశంలో వివరించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం.

Exit mobile version