NTV Telugu Site icon

Adudam Andhra: నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..

Cm Ys Jagan

Cm Ys Jagan

Adudam Andhra: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. ఆడుదాం – ఆంధ్రా ఫైనల్స్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అందజేయనున్నారు.. దీని కోసం పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసింది ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ).. సాయంత్రం 5.45 గంటలకు మధురవాడ హిల్ నెంబర్ 3 కి హెలిప్యాడ్ కు చేరుకోనున్న సీఎం.. 6 గంటలకు PM పాలెం స్టేడియంలో క్రికెట్ అభిమానులను కలుసుకుని, క్రీడాకారులను అభినందనలు తెలుపుతారు.. ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్ క్రికెట్ వీక్షించడంతో పాటు కొంత సేపు క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది.. ఇక, రాత్రి 8.35 గంటల సమయంలో విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

Read Also: CM Revanth: నేడు మేడిగడ్డకు సర్కార్ టూర్.. సీఎంతో పాటే మంత్రులు, ఎమ్మెల్యేలు..

అయితే, మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన విషయం విదితమే.. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగుతూ వచ్చాయి.. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ కిట్లను అందించింది వైఎస్‌ జగన్‌ సర్కార్..