NTV Telugu Site icon

CM YS Jagan: సీఎం జగన్‌ సుడిగాలి పర్యటన.. నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం

Jagan

Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. తన ప్రచారంలో మరింత దూకుడు పెంచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ మధ్య వరుసగా రోజు మూడు సభల్లో పాల్గొంటున్న ఆయన.. నిన్న (ఆదివారం) తన ప్రచారానికి బ్రేక్‌ ఇచ్చారు.. అయితే, ఈ రోజు మూడు నియోజకవ­ర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు.. నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన కొనసాగనుంది.. వరుసగా ఉమ్మడి జిల్లాలో, రెండు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం బహిరంగ సభల్లో పాల్గొననున్నారు సీఎం జగన్‌.. ఉదయం 10 గంటలకు బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సీఎం.. బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని రేపల్లెలో ఉన్న బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌లో ఈ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు పల్లాడు జిల్లా మాచర్లలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్‌ మహల్‌ సెంటర్‌లో ఈ సభ జరగనుంది.. ఆ తర్వాత.. కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లనున్నా సీఎం జగన్‌.. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: Indian Army: మానవత్వం చాటుకున్న భారత జవాన్లు.. అసలేమైందంటే..?