ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామక్రిష్ణ అన్నారు. 82 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఎందుకు వచ్చిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కంటే జగన్ పెద్ద నియంత అని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతారని రామక్రిష్ణ పేర్కొన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు కొట్టుపోతే మరమ్మతులు చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ మాట్లాడుతూ… ‘మాజీ సీఎం కేసీఆర్ కంటే సీఎం జగన్ కంటే పెద్ద నియంత. రాష్ట్రంలో ఎన్నికలు జరగకముందే సీఎం ఓటమిని అంగీకరిస్తున్నారు. 82 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఎందుకు వచ్చోదో జగన్ చెప్పాలి. జగన్ అవునన్నా కాదన్నా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా ఓడిపోతుంది. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు గొంతు విప్పాలి. సీఎం జగన్ సర్పంచ్ నుంచి మంత్రుల వరకు అందరినీ నిర్వీర్యం చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు కొట్టుపోతే మరమ్మతులు చేయలేని అసమర్ధ సీఎం జగన్మోహన్ రెడ్డిది’ అని మండిపడ్డారు.
Also Read: 104 Vehicle: గ్రామంలోకి రాకుండా.. 104 వాహనాన్ని అడ్డుకున్న వైసీపీ నాయకుడు!
‘అంగన్వాడి వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్ మోసం చేశారు. అపాయింట్ మెంట్ కూడా దొరకనందుకు మంత్రి సిదిరి అప్పలరాజు సిగ్గుపడాలి. ‘కేంద్రంలో నరేంద్ర మోడీని గద్దె దించాలి, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి’ ఇదే మా ప్రధాన ఉద్దేశ్యం. దీని కోసం ఏ పార్టీ ముందుకు వచ్చినా కలుపుకొని వెళ్తాము. 16, 17 తేదీలలో సీపీఐ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం భువనేశ్వర్ లో జరగనుంది. ఈ సమావేశంలో పొత్తులుపై చర్చిస్తాం’ అని రామక్రిష్ణ తెలిపారు.