NTV Telugu Site icon

CM Jaganmohan Reddy: ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు

Jagan

Jagan

ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ ‘ఈద్‌ ముబారక్‌’ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అన్నారు సీఎం జగన్.. .ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలి.., అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలి…మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని శ్లాఘించారు సీఎం జగన్. కఠోర ఉపవాస దీక్షలతో క్రమ శిక్షణ, దానధర్మాలతో దాతృత్వం, సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Read Also:SRH vs CSK: టాస్ గెలిచిన సీఎస్కే.. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్

పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని ముఖ్యమంత్రి అన్నారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని ముఖ్యమంత్రి తన సందేశంలో తెలిపారు.

Read Also: Asaduddin Owaisi: అతీఖ్ అహ్మద్ హత్య కేసు.. ఖరీదైన పిస్టళ్లను నిందితులకు ఎవరిచ్చారు?