NTV Telugu Site icon

Breaking: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల

Jagan

Jagan

AP CM Jagan Released Jagananna Vedeshi Vidya Deevena Funds: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లను విడుదల చేశారు. సివిల్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు. జగనన్న విదేశీ విద్యా దీవెనపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని సీఎం జగన్ తెలిపారు. పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్‌ యూనివర్సిటీల్లో చదువుతున్నారని తెలిపారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ఈ పథకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Read Also: Andhrapradesh: ఒమిక్రాన్‌ కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి.. అప్రమత్తమైన వైద్యశాఖ

రూ. 8లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దన్నారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్‌ పాస్‌ అయితే రూ.లక్షా 50 వేలు అందిస్తున్నామని వెల్లడించారు.