Site icon NTV Telugu

AP CM Jagan London Tour: కుటుంబసమేతంగా లండన్‌ పర్యటనకు సీఎం జగన్

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM Jagan London Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి లండన్ పర్యటనకు బయలుదేరారు. కుటుంబ సమేతంగా గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్‌ లండన్ బయలుదేరారు. పది రోజుల పాటు ముఖ్యమంత్రి విదేశీ ప్రయాణంలో ఉండనున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Also Read: AP CM Jagan: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం జగన్‌, భారతి దంపతులు అక్కడ చదువుకుంటున్న తమ పిల్లలను కలిసేందుకు వెళుతున్నారు. లండన్ నుంచి తిరిగి ఈ నెల 12న వస్తారు.. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.సీబీఐ కోర్టు ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. తన లండన్‌ పర్యటనకు సీఎం జగన్ ప్లాన్ చేసుకున్నారు.ఈ మేరకు కోర్టులో అనుమతి కోరారు.. ఈ ఏడాది సెప్టెంబర్ 2 నుండి 12వ తేదీ వరకు జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కుటుంబ సమేతంగా యూకే పర్యటనకు వెళ్తున్నట్టుగా కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో సీఎం జగన్‌ విదేశీ పర్యటన ఖరారైంది.

Exit mobile version