NTV Telugu Site icon

Fourth White Paper: నేడు మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..

Babu

Babu

Fourth White Paper: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్‌ రంగంలోని సంక్షోభం.. ఇలా వరుసగా ఇప్పటి వరకు మూడు శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మరో శ్వేత పత్రం విడుదలకు సిద్ధం అయ్యారు.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు 4వ శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు… గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయను్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

Read Also: EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న స్పెయిన్

అంటే, గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో జరిగిన భూములు, ఇసుక, సహజ వనరుల దోపిడీపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ల్యాండ్‌ టైటిలింగ్ చట్టం ద్వారా ఎలాంటి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం తెరలేపింది అనే అంశాన్ని ప్రస్తావించనున్నారు సీఎం చంద్రబాబు.. ఇక, ఇష్టానుసారంగా ఇసుక, ఇతర ఖనిజ వనరుల్ని దోపిడీ చేశారని, భూములు కబ్జా చేశారని అలాగే ఎర్రచందనం వంటి అరుదైన వనరులనూ దోచుకున్నారని ఆరోపణలు చేస్తూ వచ్చారు కూటమి నేతలు.. ఈ అంశాలపై పూర్తి వివరాలు ప్రజలకు తెలిసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారని చెబుతున్నారు.