Site icon NTV Telugu

Amaravati: రాజధాని పనుల పున:ప్రారంభంపై సీఎం చంద్రబాబు ట్వీట్

Cm Chandrababu

Cm Chandrababu

Amaravati: రాజధాని పనుల పున:ప్రారంభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతి రైజెస్ ఎగైన్ అంటూ ముఖ్యమంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభంపై రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే గెలుస్తుంది…అమరావతే నిలుస్తుంది…ఇదే ఫైనల్ అంటూ 2022 అక్టోబర్ 22న నాడు ప్రతిపక్ష నేతగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. రాజధానిపై వైసీపీ కుట్రలు సాగవంటూ నాడు తాను చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ రాజధాని పనుల పున:ప్రారంభంపై సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Read Also: Minister Kondapalli Srinivas: గుర్లలో భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాప్తి..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు ఇవాళ పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. అమరావతిలోని లింగాయపాలెం దగ్గర సీఆర్డీఏ బిల్డింగ్ మిగిలిన పనులను పునఃప్రారంభించారు సీఎం చంద్రబాబు.. దీంతో.. రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టు అయ్యింది.. 160 కోట్ల రూపాయలతో జరపాల్సిన సీఆర్డీఏ కార్యాలయ ఇంటీరియర్ పనులను ఈ రోజు ప్రారంభించారు సీఎం చంద్రబాబు.

Exit mobile version