Site icon NTV Telugu

CM Chandrababu: మైనార్టీ సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Chandrababu

Chandrababu

CM Chandrababu: మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇమామ్‌లకు, మౌజన్‌లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవ వేతనం ఇవ్వడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైనారిటీలకు లబ్ది జరిగేలా వ‌క్ఫ్‌ భూముల అభివృద్ధికి సూచనలు చేశారు.

Read Also: AP CM Chandrababu: కర్నూలులో హైకోర్టు బెంచ్‌.. అమరావతిలో లీగల్ కాలేజ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన రూ.447 కోట్ల కు సంబంధించి పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరై కొంత మేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ప్రారంభంకాని పనులను రద్దు చేసి పునః సమీక్ష చేయనున్నామని సీఎం తెలిపారు. వక్ఫ్ బోర్డు భూముల సర్వే రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version