NTV Telugu Site icon

CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Chandrababu

Chandrababu

CM Chandrababu: వివిధ శాఖలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (బుధవారం) సమీక్షించనున్నారు. అలాగే, ఆర్థిక శాఖపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదన చేసింది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేత పత్రంపై సీఎం కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం 3. 30 గంటలకు ఎక్సైజ్ శాఖ మీద కీలక సమీక్ష చేయనున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత బీపీసీఎల్ ఛైర్మన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు.

Read Also: Odisha : పూరి జగన్నాథ యాత్రలో భారీ ప్రమాదం.. రథం పడి ఎనిమిది మందికి గాయాలు

అలాగే, సీఎం చంద్రబాబు రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ మేర‌కు సీఎంవో అధికారులు షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. రేపు ఉదయం 10.00 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి.. 11.20-11.50 వరకు అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి దగ్గర పోలవరం ఎడమ కాలువను పరిశీలించనున్నారు. ఆ తర్వత మధ్యాహ్నం 12.35- 01.30 వరకు భోగాపురం ఎయిర్ పోర్టును సందర్శించనున్నారు. అనంతరం ఎయిర్ పోర్టు పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే, మెడ్ టెక్ జోన్ వర్కర్లతో భేటీ అవుతారు.. సాయంత్రం 04.50-06.00 విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్‌లో అధికారులతో భేటీ అయి.. గత ఐదేళ్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు.