ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగిసింది. సీఎం చంద్రబాబు గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు జ్యూరిచ్ నుంచి బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీలోని అధికారిక నివాసానికి సీఎం చేరుకున్నారు. ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్‌తో సమావేశం అవుతారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను చంద్రబాబు కలనునారు. అలానే శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిలతో భేటీ కాకానున్నారు.
శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు బయల్దేరి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. నాలుగు రోజుల దావోస్ పర్యటన సందర్భంగా ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం పాల్గొన్నారు. ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో బిజీబిజీ గడిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అందుకు అనువైన పరిస్థితులను సీఎం వివరించారు.