Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Anantapur Ap Cm Chandrababu Naidu Announces 100 Day Water Conservation Action Plan In Andhra Pradesh

CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం… సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..

Published Date :April 6, 2026 , 1:06 pm
By Sudhakar Ravula
CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం… సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం… దానిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అనంతపురం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో నీటి సంరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. “నీరు మనందరికీ సర్వస్వం.. దానిని సంరక్షించుకోవడానికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టాం” అని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రత కోసం సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పరిగెత్తే నీటిని నిలబెట్టడం, నిల్వ ఉన్న నీటిని సరైన విధంగా ఉపయోగించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. జలాశయాలు నింపడం, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం వంటి పద్ధతులను విస్తృతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. “నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి” వంటి పథకాల ద్వారా నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చామని అన్నారు.

Read Also: Leander Paes: బీజేపీలో చేరిన వారానికే లియాండర్ పేస్‌‌కు ఎక్స్ కేటగిరీ భద్రత.. రాజకీయ పార్టీలు ఆశ్చర్యం

అనంతపురం వంటి ఎడారిగా మారిన ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు గతంలో ఇన్‌పుట్ సబ్సిడీలు అందించామని గుర్తుచేశారు చంద్రబాబు.. డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తూ 90 శాతం సబ్సిడీతో పరికరాలు అందించామని చెప్పారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్‌కు రూ.1,031 కోట్ల వ్యయం చేస్తూ దేశంలో ముందంజలో ఉన్నామని వెల్లడించారు. ఈ చర్యల వల్ల రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా మారిందని, పండ్ల తోటల పెంపులో అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు. భూగర్భ జలాల స్థాయి కూడా మెరుగుపడిందని సీఎం పేర్కొన్నారు. గతంలో అనంతపురంలో 13 మీటర్ల లోతులో లభించిన నీరు ఇప్పుడు 11 మీటర్లకే అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇది ప్రభుత్వ చర్యల ఫలితమని చెప్పారు.

అలాగే శ్రీశైలం నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తున్నామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని అందించి, అక్కడ ఆదా అయిన నీటిని రాయలసీమకు మళ్లించామని చెప్పారు. విద్యుత్ ఛార్జీల విషయానికొస్తే, గత ప్రభుత్వాలు భారీగా పెంచిన భారం ప్రజలపై వేయకుండా కూటమి ప్రభుత్వం భరిస్తోందని సీఎం తెలిపారు. రూ.4,600 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు. అంతేకాకుండా తొలిసారి విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ చేయడం కూటమి ప్రభుత్వ ఘనతగా ఆయన పేర్కొన్నారు. మొత్తంగా నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చి, రాష్ట్రాన్ని నీటి విషయంలో స్వయం సమృద్ధిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 100 days action plan Andhra Pradesh
  • Andhra Pradesh irrigation news
  • AP water conservation scheme
  • Chandrababu Naidu water plan
  • drip irrigation subsidy AP

తాజావార్తలు

  • CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం… సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..

  • DrivingLicense: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి షాక్.. ఇకపై ఆ టెస్ట్ పాసైతేనే ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు!

  • Karishma Tanna: 42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్.. బేబీ బంప్‌ ఫొటోలు వైరల్..

  • Leander Paes: బీజేపీలో చేరిన వారానికే లియాండర్ పేస్‌‌కు ఎక్స్ కేటగిరీ భద్రత.. రాజకీయ పార్టీలు ఆశ్చర్యం

  • Vignesh Shivan: అనిల్ రావిపూడి రివ్యూతోనే ‘LIK’ పై నమ్మకం పెరిగింది..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions