Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.. ఇదే సమయంలో.. అమరావతి ఇన్నిర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులు కూడా నమోదయ్యాయి.. తాజాగా చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది సీఐడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కొత్త కేసు నమోదు చేసింది సీఐడీ. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది.
Read Also: Minister Talasani: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని అంత ఆషామాషీగా తీసుకోకూడదు..
ఇప్పటికే చంద్రబాబుపై ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు మరో కేసు లైన్‌లోకి చ్చింది.. అయితే, సీఐడీ నమోదు చేసిన తాజా కేసులో ఏ1 గా నరేష్, ఏ2 గా కొల్లు రవీంద్రను చేర్చింది సీఐడీ.. డిస్టలరీస్ కమిషనర్ వాసుదేవ రెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు నమోదు అయ్యింది.. రూ.1,300 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు.. నంద్యాలోని ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీకి అనాచిత లబ్ధి చేకూర్చారని సీఐడీ పేర్కొంది.