Site icon NTV Telugu

Chandrababu: చంద్రబాబుపై మరో కేసు నమోదు

Chandrababu

Chandrababu

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీఎమ్‌డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యాదుతో సీఐడీ అధికారులు నారా చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. అయితే, చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తుంది. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా ఆయన పట్టించుకోలేదు అని సీఐడీ తెలిపింది. 2016-19 మధ్య అక్రమ మైనింగ్ కు వివిధ కేసుల్లో 40 కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు.. ఈ విషయాన్ని సీఐడీ ఎఫ్ఐఆర్ లో పొందుపర్చింది. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని.. మైనింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది.

Exit mobile version