Site icon NTV Telugu

AP CID Chief Sanjay: సెలవుపై విదేశాలకు ఏపీ సీఐడీ చీఫ్‌..

Sanjay

Sanjay

AP CID Chief Sanjay: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు విడుదలైన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఏపీ సీఐడీ చీఫ్‌ ఎన్‌ సంజయ్‌ సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నారట సంజయ్‌.. ఇక, సెలవుపై వెళ్లేందుకు సంజయ్ కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. అయితే, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు సీఐడీ చీఫ్ సంజయ్. మరోవైపు.. సంజయ్ విదేశాల నుంచి తిరిగి వచ్చేంత వరకు వేరే అధికారులకు సీఐడీ బాధ్యతలు అప్పగించాలని డీజీపీకి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి సంజయ్ తిరిగొచ్చాక సీఐడీ చీఫ్ గా రీ-పోస్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్‌ జవహర్‌రెడ్డి.

Read Also: NDA Alliance Meet: నేడు ఎన్డీయే కూటమి భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక చర్చలు..!

Exit mobile version