Site icon NTV Telugu

AP Election Results 2024: విజయోత్సవాలకు నో పర్మిషన్.. అతి చేస్తే అంతే..

Ap Ceo

Ap Ceo

AP Election Results 2024: కౌంటింగ్ రోజున విజయోత్సవాలకు ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.. ఏపీ సీఈవో ఎంకే మీనా.. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లపై ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 92 శాతం మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. రేపు ఉదయం ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా హాల్స్ ఏర్పాటు చేశాం. ప్రత్యేక ఏర్పాట్లు ఉన్న చోట ఈవీఎంలు కౌంటింగ్ కూడా 8 గంటలకే ప్రారంభంకానుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక హాల్స్ లేని చోట్ల ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తాం. పార్లమెంట్ సెగ్మెంట్ల ఈవీఎంల కౌంటింగ్ ఎనిమిది గంటలకే ప్రారంభం అవుతుందని.. ప్రతి కౌంటింగ్ సెంటర్లో మీడియాకి ఏర్పాట్లు చేశాం. మొబైల్ ఫోన్లను మీడియా సెంటర్ వరకు తీసుకెళ్లవచ్చు అని వెల్లడించారు. ఇక, కౌంటింగ్ కేంద్రం లోపలకు మీడియాను నోడల్ అధికారుల పర్యవేక్షణలో గ్రూపులుగా తీసుకెళ్తాం అని పేర్కొన్నారు.

Read Also: Akasa Air: ఢిల్లీ – ముంబై విమానానికి సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్‌కు మళ్లింపు

ఇక, అమలాపురం పార్లమెంట్ పరిధిలో గరిష్టంగా 27 రౌండ్లలో కౌంటింగ్‌ జరుగుతుంది.. సాయంత్రం 6 గంటలకు అమలాపురం పార్లమెంట్ ఫలితాలు వస్తాయని తెలిపారు ముకేష్‌ కుమార్‌ మీనా.. రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్లకు కేవలం 13 రౌండ్లే ఉంటాయి.. భీమిలీ, పాణ్యం అసెంబ్లీ సెగ్మెంట్లల్లో 26 రౌండ్లు. కోవూరు, నరసారపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లు ఉంటాయన్నారు. కౌంటింగ్ సెంటర్లల్లో వెబ్ క్యాస్టింగ్ ఉండదు. ప్రతి ప్రక్రియను వీడియో గ్రాఫ్ తీస్తాం. అనుమతించిన సమయంలో కౌంటింగ్ ప్రక్రియను మీడియా షూట్ చేయొచ్చు. అంకెలను మీడియా షూట్ చేయడం నిషిద్దం అని స్పష్టం చేశారు.

Read Also: Dasyam Vinay Bhasker: వరంగల్ నుంచి మరోసారి మరో ఉద్యమం ప్రారంభిస్తాం..

మరోవైపు.. జనవరి నుంచి నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 483 కోట్లు పట్టుకున్నాం. వీటిల్లో రూ. 170 కోట్ల నగదు ఉందన్నారు ఎంకే మీనా.. సి-విజిల్ ద్వారా భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఏపీలో ఈస్థాయిలో పోలింగ్ ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. క్లినెస్ట్ ఓటర్ లిస్ట్ తయారు చేశాం. కానీ, పల్నాడు, అనంతపురం, తిరుపతిల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కౌంటింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నాం అన్నారు. కౌంటింగ్ కోసం మొత్తం 67 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నాం. కౌంటింగ్ సెంటర్ల పరిసరాలను రెడ్ జోన్ గా ప్రకటించామని వెల్లడించారు. ఏపీలో మొత్తంగా 1985 సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. సమస్యలను సృష్టించే 12 వేల మందిని గుర్తించి.. బైండోవర్ చేశాం. ఇప్పటి వరకు 1200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించాం. డ్రోన్ల ద్వారా నిఘా పెట్టాం అన్నారు. 25 వేల మంది కౌంటింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నాం.. సీనియర్ పోలీస్ అధికారులను అన్ని జిల్లాలకు పర్యవేక్షకులుగా నియమించాం. కౌంటింగ్ హాల్లో ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే బయటకు పంపేస్తామని స్పష్టం చేశారు ఏపీ సీఈవో ఎంకే మీనా..

Exit mobile version