ఆప్కాస్ వ్యవస్థపై పూర్తి యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామక వ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. విద్యాశాఖ చాంబర్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, పురపాలక శాఖ మంత్రి నారాయణతో కూడిన మంత్రుల బృందం అధికారులతో మొదటిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆప్కాస్ వ్యవస్థ గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు.
Also Read: Today Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభాలే!
రాష్ట్రంలో మొత్తం లక్ష 7 వేలకు పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని మంత్రులకు అధికారులు తెలిపారు. శాఖల వారీగా ఉద్యోగుల వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మొత్తం ఉద్యోగుల్లో అత్యధికంగా స్వీపర్లు-పబ్లిక్ హెల్త్ వర్కర్లు 28.89 శాతం, అటెండర్లు 9.64 శాతం, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 9.10 శాతం మంది ఉన్నారు. 2020 నుంచి చేపట్టిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై అధికారులను మంత్రుల బృందం ఆరా తీసింది. న్యాయవివాదాలను పరిశీలించాలని, ఆప్కాస్ వ్యవస్థ ప్రక్షాళనపై పూర్తి యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. పూర్తి అధ్యయనం తర్వాత మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.
