NTV Telugu Site icon

Ap Cabinet Meet: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

Ap Cabinet

Ap Cabinet

వాయిదాల మీద వాయిదాలు పడిన ఏపీ కేబినెట్ ఇవాళ జరగనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. గత నెల చివరి నుంచి ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది కేబినెట్.. ఇవాళ ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాలపై మంత్రిమండలి చర్చించనుంది. ఈ నెల 19 నుంచి 24 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.బ్లాక్ 1లో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది.

Read Also: Diesel Shortage: చెన్నై నగరంలో డిజిల్ కొరత.. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు

ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన CPS అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే GPS అమలుపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి జీవోలను సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే ఇవాళ జరిగే కేబినెట్‌ భేటీలో ఆమోదించే అవకాశం ఉంది.

దీనిపై మంత్రి బొత్స ఉపాధ్యాయ సంఘాలతొ చర్చించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా YSR హెల్త్ హబ్స్ ఏర్పాటుపైనా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు SIPBకి కేబినెట్ ఆమోదం తెలిపనున్నట్లు సమాచారం. ఇటీవల గ్రీన్ ఎనర్జీ రంగంలో 81వేల కోట్ల పెట్టుబడులతో పాటు మరిన్ని పెట్టుబడులకు SIPB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ అంశాలపైన చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక సచివాలయంలో 80కు పైగా కొత్త పోస్టులకు ఆమోదం తెలపనుంది. సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులను ఈ కొత్త పోస్టులలో అసిస్టెంట్ డైరెక్టర్, సెక్రటరీలుగా ప్రభుత్వం నియమించనుంది. పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు వంటి అంశాల పై చర్చించే అవకాశం కనిపిస్తోంది.

Read Also: NBK108: మనిషి ముసుగులోని మృగంతో బాలయ్య ఢీ..?