ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. విశాఖపట్టణం కేంద్రంగా రాజధాని అంశంతోపాటు అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు వచ్చే నెల మొదటి వారంలో జరిగే ఇన్వెస్టమెంట్ సమ్మిట్ పై కాబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకోనుంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఫిబ్రవరి నెల చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించింది. అయితే మార్చి మొదటి వారంలో వైజాగ్‌లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. ఆ సమ్మిట్ తర్వాత అసెంబ్లీ నిర్వహించే ఆలోచనలో చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా ఏర్పాటు చేయటం ఇబ్బందిగా మారుతుందని భావించిన ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ తరువాత అసెంబ్లి సమావేశాలు నిర్వహించటం మంచిదని భావిస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో విశాఖ కేంద్రంగా రాజధాని అని అక్కడకే తాను కూడా వెళ్తున్నానని స్పష్టం చేశారు. దీంతో రాజధాని అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం విశాఖ షిఫ్టింగ్‌పై కూడా క్యాబినేట్‌లో కీలకంగా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.ఇటు అమరావతి రైతులు కూడా మౌనంగా ఉన్నారు. రాజధాని పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించనుంది. దీంతో అమరావతి రైతులు భవిష్యత్ కార్యాచరణపై వేచిచూసే ధోరణిలో ఉన్నారు.